నాలో....!!

నాలో నీవున్నవని కలలు కంటూ,
తామరాకుపై నీటి బిందువునయినాను..
గాలిలా వచ్చి నన్ను నీట కలుపుతావో,
అరచేయితో అందుకొని ఆరగిస్తావో..?!!

నీలో నేనున్నాను అని ఊహించుకుంటూ,
నీలి మేఘాల అంచులో వర్షపు చుక్కనయినాను..
వలపుల చినుకులలో తడిసి పరవశిస్తావో,
పక్షివై మేఘాలను దాటి ఎగిరిపోతావో..?!!

కలలు, ఊహలు నా సొంతం అనుకుంటూ,
నీ దారిలో నిన్ను సాగానంపుతున్నాను..
నన్ను చేరే మార్గం వెతుకుతావో,
నన్ను నన్నుగా వదిలి వెల్లిపోతావో..?!!

సుడిగాలిలో చిక్కినా చిరునవ్వును పులుముకుంటూ,
సుదూర తీరాలలో విరిసిన సిందూర పువ్వునయినాను..
సువిశాల మనసుతో సిరివెన్నెల పల్లికి తెస్తావో,
సంద్యాకాలపు పువ్వుగా వాడిపోనిస్తావో..?!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

1 comments:

Anonymous said...

so nice art...!

Post a Comment