నాలోని ఆశ..!!

గడిచిపోయే కాలంలో కలిసిపోయే రాగం ఉంది..
ఆ రాగంలో సరిపోయే గేయం కావాలని ఉంది..!!

ఉప్పొంగే సాగారంలాంటి యదలో తీయనైన భావం ఉంది..
ఆ భావంతో అలలా ఎగసిపడే కవితను కావాలని ఉంది..!!

గళ్ళు గళ్ళు మనే మువ్వలో దాగని మౌనం ఉంది..
ఆ మౌనం మాటున ఉన్న సవ్వడిని కావాలని ఉంది..!!

నీదైన ప్రపంచంలో తెలియని మమతానుబంధం ఉంది..
ఆ మమతలో ఒదిగిపోయి నీలో సగం అవ్వాలని ఉంది..!!

నాలోని ఈ ఆశకు అంతం లేదు అనిపిస్తుంది..!!!!




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఎలా తెలుపను..??!!

పూర్వజన్మ బంధమేదో నిన్ను నన్ను కలిపింది..
నేను లేకున్నా నువ్వు బ్రతకగలవని తెలుసు..
నువ్వు లేకున్నా బ్రతుకుతాననుకున్నాను నేను..
బ్రతికి సాధించేదేమిటో అని ఆలోచిస్తున్నాను..
క్షణం ఒక యుగమవుతుంది అనుకోలేదు..
మరుజన్మ వరకు వేచి ఉండలేనని ఎలా తెలుపను..
పెదాలు దాటని పదాలతో వారధిని ఎలా కట్టను..
మదిలోనే సమాధి చేస్తూ మరుజన్మకై ఎలా వేచి ఉండను..
ఆవేదన అంబరంలో కన్నీటి చుక్క రాలిపోతుంది..
ఆలోచనల వెల్లువకు మౌనరాగం తోదవుతుంటే,
ఆశతో నిష్క్రమించబోయే నా శ్వాస
జీవిత సమర గీతానికి మరణ మృదంగం అవుతున్నది..!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

చేయిలో చేయి వేసి...




కష్టాల కడలి ఒడ్డున ఇసుకతో కట్టినాను ఆశల సౌధాన్ని..

కడలి అలలు తాకుతాయేమో అని అరచేయిని అడ్డుపెట్టినాను..

చేయిలో చేయి వేసి నా ఆశలను నిలపెడతావో,

అలల అలజడితో అలిసిన అరచేయిని అలాగే వదిలేస్తావో..??!!






  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

గోగుపువ్వు..

గోధూళి వేల గోరంత దీపం పెట్టి కొండంత ఆశతో వేచి ఉన్నాను,
గోగు పువ్వు పలకరించి గోరింటాకు చేతికిచ్చి పెట్టుకోమంది..
గోరింట రంగును పూయించే గోపయ్య చెంత చేరితే గోరింటతో పనేముంటుంది అంటే,
గోగుపువ్వు వింతగా చూసి చిన్నగా కుల్లుకుంది..!!





  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

వేచి ఉన్నాను...!!

సాయంకాలపు సంద్యావేలలో
సరిగంచు చీర కట్టి
సిరి మువ్వల అందెలు తొడిగి
సిరి మల్లెపూలు సిగలో దోపి
చిరునవ్వుల వరమిచ్చే
చెలియ చేతిని పట్టుకొనగా
రెక్కల గుఱ్ఱంపై వస్తావని
రేయినే పగలుగా తలచి
పండు వెన్నెలలో మెరిసే తారలను పిలిచి
నీ జాడ తెలుపుమని ప్రాధేయపడుతూ
నీ కొరకు వేచి ఉన్నాను..!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS