ఒక కల....!!

నేను కన్న కలలు చాలా వున్నాయి,
అందులో ఒక కల,

ఒక మంచి కవిత రాయాలని
అది అందరి జీవితాన్ని తాకాలని..

ఒక మరువలేని చిత్రం గీయాలని
ఆ చిత్రంలో ప్రాణం పోయాలని..

ఒక మధురమైన పాట రాయాలని
ఆ పాటతో మనసు పరవశించాలని..

ఒక గౌరవప్రదమైన ఉన్నతి పొందాలని
అది అందరికి ఆదర్శం కావాలని..

ఒక కలలా అజ్ఞాతంలో అంతమవ్వాలని
అంతమై అందరిలో జీవించాలని..

కల కన్నాను, కంటున్నాను.....!!!!




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఓ మహిళా....!!!


మహిళా..!!
అమ్మగా లాలించి,
అక్కగా బుజ్జగించి,
చెల్లిగా చెడుగుడు ఆడి,
చెలిగా మురిపించి,
ఆలిగా అలరించి,
అమ్మమ్మగా బుద్దులు చెప్పి,
నానమ్మగా గోరుముద్దలు పెట్టి,
మనిషి మనుగడకు ఆదియు అంతము నీవే అయినావు..
అన్ని రంగాలలో ప్రగతిని సాధించినా
ద్వితీయ స్థానమే నీకు దొరికినందుకు చింతిస్తున్నాను..
స్వశక్తితో ముందుకు సాగిపోవాలని కోరుతూ,
'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'..

Happy women's day....!!


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నాలో....!!

నాలో నీవున్నవని కలలు కంటూ,
తామరాకుపై నీటి బిందువునయినాను..
గాలిలా వచ్చి నన్ను నీట కలుపుతావో,
అరచేయితో అందుకొని ఆరగిస్తావో..?!!

నీలో నేనున్నాను అని ఊహించుకుంటూ,
నీలి మేఘాల అంచులో వర్షపు చుక్కనయినాను..
వలపుల చినుకులలో తడిసి పరవశిస్తావో,
పక్షివై మేఘాలను దాటి ఎగిరిపోతావో..?!!

కలలు, ఊహలు నా సొంతం అనుకుంటూ,
నీ దారిలో నిన్ను సాగానంపుతున్నాను..
నన్ను చేరే మార్గం వెతుకుతావో,
నన్ను నన్నుగా వదిలి వెల్లిపోతావో..?!!

సుడిగాలిలో చిక్కినా చిరునవ్వును పులుముకుంటూ,
సుదూర తీరాలలో విరిసిన సిందూర పువ్వునయినాను..
సువిశాల మనసుతో సిరివెన్నెల పల్లికి తెస్తావో,
సంద్యాకాలపు పువ్వుగా వాడిపోనిస్తావో..?!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఓ వనిత..!!

ఓ వనిత..!!
పచ్చని ఆకువై నీవు సున్నితంగా నిలిచినావు..
పసిడి పురేకువని ఈ ప్రపంచం గుర్తించలేదు..
కుటుంబానికి వెన్నెముఖవైన నీవు ఇంకా కుంటుతున్నావు..
కడలినికాదు కంటిలో నింపేది కమ్మని కలలను..

కలత చెందకే మగువ కనికరం లేని ప్రపంచాన్ని చూసి,
ప్రగతి చెందినా పట్టించుకోని సగటు పామరుడిని చూసి,
సాగిపో ముందుకు అడ్డువచ్చినవారి తలలు దించుకునేట్టుగా చేసి...!!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ప్రార్థిస్తున్నాను...


ప్రార్థిస్తున్నాను నా శ్వాసని నిలిపి ఆ దేవుడిని
నీ శ్వాసలోని ఆశను నేనే కావాలని..
అంతంలేని ఈ బ్రతుకు బ్రతికింది చాలు..
నిండి ఉన్నావు నాలోనే అదే నాకు పదివేలు..
నిత్యం నీదైన ప్రపంచంలో తిరుగుతున్నావు..
నా ప్రపంచంలో నన్ను నేను మరిచాను..
నన్ను నేను మరిచినా నీవు నన్ను వీడవు..
ఈ జీవశ్చవానికి జీవమై చైతన్య జ్యోతివయ్యావు..
నీ ఉపిరిలోని తుది శ్వాసను నేనే అవుతాను..!!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నా మనసు వాకిట..!!




మనసు వాకిట మానువై నిలిచినావు,
నీ చల్లని నీడనే నేను కోరుకుంటున్నాను..
నీరు పోసి నిన్ను పెంచకపోయినా
నన్ను వీడి పోలేవు నేను అంతమయ్యేవరకు..
పక్షులేన్ని వాలినా అవి వలసపోయేవే..
పచ్చని చెట్టుగా నా ముంగిట నీవుంటావు..
గాలి వానలు, ఉరుములు మెరుపులు నీ నీడలో నన్ను తాకలేవు..
నీ గాలినే నా ఊపిరిగా నేను బ్రతుకుతాను తుదివరకు...!!!


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

జీవితం నేర్పింది..!!





















జీవితం
అనేది కష్ట సుఖాల సంఘమం..
ఒకరు నేర్పితే తెలియనిది జీవితం నేర్పుతుంది..

జీవితం నాకు నేర్పింది,

దేనికి ఎదురు చూడవద్దని,
ముందుకు సాగిపొమ్మని..

ఎవరిమీదా ఆధారపడవద్దని,
ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని..

నీకు నువ్వే తోడు అని,
ఎదుటివారికి నీడగా ఉండమని..

మంచినెన్నడు మరవరాదని,
చెడును వెంట పెట్టుకోవద్దని..

ఎదుటివారి తప్పును ఎంచవద్దని,
నీ తప్పును కప్పిపుచ్చవద్దని..

సుఖ దుఖాలను సమానంగా చూడమని,
గర్వాన్ని దరి చేరనియవద్దని..

ఈర్ష్యా ద్వేషాలు నీకు శత్రువులని,
నీ చిరునవ్వులే నీకు మిత్రులని..

మంచివాడు మోసం చేయడని,
మోసం చేసేవాడికి మంచి కనపడదని..

నీది కాని దానికి అసువులు బాయవద్దని,
అందిన దానితో సంతృప్తి పొందుమని..

నలుగురిలో ఒంటరిగా మిగలోద్దని,
ఒంటరిగా నలుగురి మెప్పును పొందమని..

సంతోషాన్ని ఎన్నడు వెతకవద్దని,
వెతికే సంతోషం దుఖాన్ని మిగిలిస్తుందని..!!



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నేస్తమా, నా ప్రియతమా...!!











నేస్తమా, నా ప్రియతమా....
తెలుగు అక్షరమాలతో 'మధు'రమైన నా మనసు
అల్లింది 'నీకోసం' ఒక కవిత...!!

'అ'నురాగముతో నిండిన నా మనసు
'ఆ'నందంగా నిన్ను చేరుతానంది
'ఇ'లలో స్వర్గం నీతోనే అంది
'ఈ'లవేస్తూ పాటపాడే నిన్ను మర్చిపోనంది
'ఉ'న్నాను అంది నీ హృదయ సవ్వడిలో
'ఊ'యల ఊగుతున్నది నీ ఊసులతో
'ఋ'ణపడి ఉన్నాను అంది అన్నివిధాలా
'ఎ'టుచూసినా నీ తలపులే అంది
'ఏ' జన్మలోనూ నిన్ను వీడను అంది
'ఐ'క్యమవుతానంది నీ మదిలో
'ఒ'దిగి పోతానంది నీ ఒడిలో
'ఓ'దార్పు కోరుకుంటుంది ఈ ఒంటరి మనసు
'ఔ'రా నా మాట విను అంటుంది
'అం'దమైన నా మనసు..
'అః' అని ఆశ్చర్యపోకు ప్రియతమా,

ముమ్మాటికీ ఇది నిజము అని నన్ను నమ్ము......!!!!




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నువ్వే నా ప్రేమ అంటాను..??



కవితగా పుట్టిన నా భావాన్ని ప్రేమ అననా..??
నా హృదయపు అణువణువు ప్రేమ అననా..??
కవ్వించే నా కలను ప్రేమ అననా..??
పులకించే నా తనువే ప్రేమ అననా..??
నా ఉపిరిలోని శ్వాసను ప్రేమ అననా..??
పెదవులు పలికే మధుర పలుకులను ప్రేమ అననా..??
నీ ఊహల ఊయలలూగే నేను ఏమంటాను..??!
నన్ను నన్నుగా మరిపించిన నువ్వే నా ప్రేమ అంటాను..!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నన్ను వీడకు..!!


నన్ను వీడకు ప్రియతమా..!!

గాలిలో ధూళి లాంటి నా మదికి ప్రాణం పోసినావు,

గామ్యమే తెలియని అలిసిన అడుగులకు దారివయినావు..

నడుస్తున్నాను నాదే అనుకుని ఈ ప్రపంచంలో ..

తెలుసుకోలేవా ఆ ప్రపంచం నువ్వే అని..

నువ్వు లేని నా పయనం ప్రపంచాన్ని వీడుతుంది..

పరలోకం నన్ను సొంతం చేసుకుంటుంది..!!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అదృష్టం... దురదృష్టం...!!


అదృష్టమా నీవు ఎక్కడున్నావమ్మా
దురదృష్టంకు
నేనంటే చాలా ఇష్టం
అంట..
నా
ఇష్టానికి విలువనీయక నన్ను
వదలదంట..
దానిని
సాగనంపి నీకు స్వాగతం
పలుకుదాం అని
నిన్ను
వెతుకుతూ దారి తప్పానమ్మ..

నన్ను
నన్నుగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావా..

నువ్వు
లేకున్నా దురదృష్టం పోరు నేను
పడలేనమ్మ..
ఒక్క
అడుగు ముందుకువేస్తే నాలు
గడుగులు వెనక్కు తోస్తుందమ్మ..
నిన్ను
చేరే మార్గం తెలియక అలిసిపోయా
నమ్మ..
నన్ను
వెతుకుతూ నీవు వస్తావనే ఆశ కూడా పోయిందమ్మా..

ఏమీతోచని
నన్ను చూసి ఎగతాళి చేయ్యకమ్మ..

నాపై
దయ ఉంచి నిన్ను చేరే మార్గము చూపవా..!!



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

వేచి ఉన్నా..!!


నీ అడుగులో అడుగు వేస్తూ నిన్ను చేరాలి అనుకుని నీ వెంట నడుస్తున్న నా అడుగులు ఆలోచన సుడిగుండంలో చిక్కి ఆలస్యమయ్యాయి..

నీవు విడిచిన అడుగు జాడలను అలలు తాకి చెరిగిపోయాయి..
నీ అడుగుల జాడలు కనపడక అక్కడే నిలిచాను..

వెనుతిరిగి చూసి చేయి అందిస్తావనే ఆశతో
కన్నీటి కడలి తీరంలో వేచి ఉన్నాను...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS